Share News

AP Election 2024: అందుకే ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించింది: జ్యోతుల నెహ్రూ

ABN , Publish Date - May 01 , 2024 | 08:43 PM

గాజు గ్లాసు గుర్తు ఎలా వచ్చిందో తనకు తెలుసునని.. స్థానిక నేతల వత్తిడితోనే కొంతమంది అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ఆ గుర్తు కేటాయించారని జగ్గంపేట ఉమ్మడి పార్టీల అభ్యర్థి జ్యోతుల నెహ్రూ (Jyothula Nehru) తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోకు...సీఎం జగన్ (CM Jagan) మేనిఫెస్టోకు చాలా తేడా ఉందని చెప్పారు. జగన్ మేనిఫెస్టోను చూస్తే అతని మనస్సు ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

AP Election 2024: అందుకే ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించింది: జ్యోతుల నెహ్రూ
Jyothula Nehru

కాకినాడ: గాజు గ్లాసు గుర్తు ఎలా వచ్చిందో తనకు తెలుసునని.. స్థానిక నేతల వత్తిడితోనే కొంతమంది అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ఆ గుర్తు కేటాయించారని జగ్గంపేట ఉమ్మడి పార్టీల అభ్యర్థి జ్యోతుల నెహ్రూ (Jyothula Nehru) తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోకు...సీఎం జగన్ (CM Jagan) మేనిఫెస్టోకు చాలా తేడా ఉందని చెప్పారు. జగన్ మేనిఫెస్టోను చూస్తే అతని మనస్సు ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. జగన్ మేఫెస్టో సామాన్యుడికి కానీ రైతాంగానికి కానీ ఏ రకంగానూ ఉపయోగం లేదని చెప్పుకొచ్చారు.


ఎన్నికల అధికారులు తప్పు చేశారని కోర్టు తెలిపిందన్నారు. గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయించొద్దని కోర్టు ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. కాకినాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి 100 మందిని పెట్టీ మట్టి తరలిస్తున్నారని విమర్శించారు. వాహనాల వద్ద డబ్బులు వసూలు చేస్తూ ప్రజల రక్తాన్ని తాగుతున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. జనాల్లో ఉన్న వాడిగా చెబుతున్నానని.. నాలుగు గోడల మధ్య ఉన్నవారి మాటలు పట్టించుకోవలసిన అవసరం లేదని జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు.

Lok Sabha Polls 2024: తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

Read Latest AP News And Telugu News

Updated Date - May 01 , 2024 | 09:25 PM