Share News

Sweat Rice balls: అందమైన యువతుల చంకలోని చెమటతో ఘుమఘుమలాడే డిష్.. తెగ తింటున్న జనాలు!

ABN , Publish Date - May 05 , 2024 | 04:33 PM

యువతుల చంకలోకి చెమటతో చేసిన అన్నం ముద్దలకు ప్రస్తుతం జపాన్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. అనేక మంది ఈ డిష్‌ను ఎగబడి తింటున్నారు.

Sweat Rice balls: అందమైన యువతుల చంకలోని చెమటతో ఘుమఘుమలాడే డిష్.. తెగ తింటున్న జనాలు!

ఇంటర్నెట్ డెస్క్: సంప్రదాయానికి ఆధునికత జోడించడంలో జపాన్ వాళ్లు సిద్ధహస్తులని చెబుతారు. వారి వంటకాల్లో కూడా ఈ ధోరణి కనిపిస్తుంటుంది. అయితే, తాజాగా జపాన్‌లో (Japan) యువతుల చంకలోని చెమటతో చేసే ఓ ఫుడ్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అక్కడి వారు ఈ ఫుడ్‌ను ఎగబడి తింటుంటే.. విషయం తెలిసిన నెటిజన్లు (Viral) మాత్రం రోతపుడుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎమిటీ స్నాక్..

జపాన్‌లో ఒనిగిరి (Onigiri) ఓ సంప్రదాయక వంటకం. కొన్ని శతాబ్దాలుగా అక్కడి వారు దీన్ని తింటున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇవి ఉండలుగా చుట్టిన అన్నం ముద్దలు. అన్నానికి వివిధ రకాల కూరగాయలు, మాంసం, నోరి అనే ఎండబెట్టిన సముద్రపు పాచిని కలిపి చేతులతో ఉండలుగా చుట్టుకుని తింటారు. కానీ వీటి తయారీలో ఇటీవల కాలంలో యువతుల చెమట వాడటం ప్రారంభించారు. అందమైన యువతులు అన్నానికి తమ చెమటను అద్దేందుకు చంకలో పెట్టుకుని ఉండలుగా చుట్టి ఇస్తున్నారు. జనాలకు ఇది టెస్టీగా ఉండటంతో లొట్టలేసుకుంటూ తింటున్నారు (Women Sweat Infused Rice balls).

Viral: పాపం.. ఈ కుక్కకు చావు ముంచుకొస్తున్న విషయమే తెలీలా! షాకింగ్ వీడియో


తయారీలో ప్రమాణాలు

చెమటతో డిష్ అనారోగ్యం కాదా? అంటే కానే కాదంటున్నారు అక్కడి రెస్టారెంట్ల నిర్వాహకులు. యువతులు పూర్తిగా శానిటైజ్ అయ్యాకే ఈ డిష్ చేస్తారట. ఈ డిష్ కోసం యువతులు బాగా చెమట పట్టేలా ఎక్సర్‌సైజులు చేస్తారు. ఆ తరువాత అన్నం ముద్దలను తమ చంకల్లో పెట్టుకుని చెమట అద్దుతూ ఉండలుగా చుట్టి ఇస్తారు. కస్టమర్లు ఈ మొత్తం ప్రక్రియను కావాలనుకుంటే కిచెన్‌లోకి వచ్చి చూడొచ్చని కూడా కొన్ని రెస్టారెంట్లు చెబుతున్నాయి.

రోత పుట్టే డిష్‌కు ఎందుకింత డిమాండ్?

శాస్త్రవేత్తలు చెప్పే దాని ప్రకారం, రుచికి వాసనకు దగ్గర సంబంధం ఉంది. కొన్ని రకాల వాసనలు ఆహారం రుచిగా అనిపించేలా చేస్తాయి. ఇక చంకలో ఉత్పత్తి అయ్యే చెమటలో కొన్ని ఫెరొమోన్లు ఉంటాయి. ఇవి లైంగిక భావనలు పెంచేందుకు ఉద్దేశించినవి. కాబట్టి, ఈ ఫెరమోన్లతో రుచులు గుర్తించే తీరులో మార్పు వస్తోందా అనేది తేల్చేందుకు మరింత పరిశోధన జరగాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జంతువుల్లో ఫెరొమోన్ల ప్రభావం గురించి శాస్త్రజ్ఞులకు బాగానే తెలిసినా మనిషి విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఏదేమైనప్పటికీ జపాన్‌ ప్రజలు తెగ ఎంజాయ్ చేస్తున్న ఈ వంటకం నెట్టింట మాత్రం విమర్శల పాలవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - May 05 , 2024 | 04:41 PM