ఎస్‌ఆర్‌హెచ్ కొంపముంచిన కమిన్స్.. వరుస తప్పులతో..

  సన్‌రైజర్స్ వరుస పరాజయాలకు ఆటగాళ్ల వైఫల్యంతో పాటు కెప్టెన్స్ కమిన్స్ ఫెయిల్యూర్ కారణమని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

  బౌలింగ్ చేంజెస్ విషయంలో కమిన్స్ తడబడుతున్నాడు. సరైన టైమ్‌కు సరైన బౌలర్‌ను దింపడం లేదు.

  స్పిన్నర్ల మీద భరోసా ఉంచకపోవడం, పేసర్లపై అతినమ్మకం ఉంచడం టీమ్‌కు మైనస్‌గా మారింది.

  ఫీల్డర్లు వరుసబెట్టి క్యాచులు జారవిడుస్తున్నా కమిన్స్-టీమ్ మేనేజ్‌మెంట్ ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.

  ఎస్‌ఆర్‌హెచ్ వ్యూహాలు ఏవీ సరిగ్గా అమలు కావడం లేదు. ధనాధన్ అప్రోచ్‌తో బ్యాటింగ్ చేయాలనే ఆతృతతో అట్టర్ ఫ్లాప్ అవుతోంది.

  టాప్-4 బ్యాటర్లు తరచూ విఫలమవుతున్నా కమిన్స్ ఎలాంటి మార్పులు చేయడం లేదు. ఇతర ఆప్షన్స్‌ను వాడటం లేదు.

  పిచ్‌కు తగ్గట్లు బ్యాటింగ్ స్టైల్ మార్చడం, ప్లేయింగ్ 11ను చేంజ్ చేయడం పైనా కమిన్స్ ఫోకస్ చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.