గంభీర్ సామాన్యుడు కాదు..  అతడి ఆస్తుల విలువెంతో తెలుసా? 

గౌతమ్ గంభీర్‌ను టీమిండియా హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్టు బీసీసీఐ మంగళవారం అధికారికంగా ప్రకటించింది

మాజీ క్రికెటర్ అయిన గంభీర్ కెరీర్ 2003-2016 వరకు సాగింది. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో గంభీర్ సభ్యుడు.

ఓ ఆంగ్ల వెబ్‌సైట్ కథనం ప్రకారం గంభీర్ ఆస్తుల విలువ మొత్తం రూ.205 కోట్లు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా బాధ్యతలు వహించినందుకు ఈ ఏడాది సీజన్‌కు గంభీర్ రూ.25 కోట్లు అందుకున్నాడు. 

గత సీజన్లలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా ఉన్నందుకు ఒక్కో సీజన్‌కు రూ.3.5 కోట్లు తీసుకున్నాడు. 

క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత 2019లో రాజకీయాల్లోకి వచ్చిన గంభీర్ తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించాడు.

క్రికెట్ కామెంటేటర్‌గా కూడా వ్యవహరించిన గంభీర్ ఏడాదికి రూ.1.5 కోట్లు సంపాదించేవాడు. 

దేశ రాజధానిలో ఖరీదైన ప్రాంతంలో నివసిస్తున్న గంభీర్ రూ.20 కోట్ల విలువైన ఇంట్లో నివసిస్తున్నాడు. దేశ రాజధానిలో అతడికి మరో రెండు ఖరీదైన ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. 

గంభీర్ గ్యారేజ్‌లో ఆడీ క్యూ5, బీఎమ్‌డబ్ల్యూ 530డి, టయోటా కొరోలా, మహీంద్రా బొలేరో వంటి కార్లు ఉన్నాయి.