అత్యధిక ఐసీసీ ట్రోఫీలు గెలిచిన జట్లు ఇవే..!

ఇంగ్లండ్ - 3 ఐసీసీ ట్రోఫీలు

ఇంగ్లండ్ జట్టు 2019లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది. అలాగే 2010, 2022లో టీ20 ప్రపంచకప్‌లు సాధించింది.

పాకిస్తాన్ - 3 ఐసీసీ ట్రోఫీలు

1992 వన్డే ప్రపంచకప్‌ను పాకిస్తాన్ సాధించింది. 2009లో టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకుంది. 

వెస్టిండీస్ - 5 ఐసీసీ ట్రోఫీలు

1975, 79లో వెస్టిండీస్ టీమ్ వన్డే ప్రపంచకప్‌లు సాధించింది. 2012, 16లో టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకుంది. 2004లో ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. 

భారత్ - 6 ఐసీసీ ట్రోఫీలు

1983, 2011లో టీమిండియా వన్డే ప్రపంచకప్‌లను గెలుచుకుంది. 2007, 2024లో టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకుంది. 2002 (శ్రీలంకతో సంయుక్తంగా), 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను సాధించింది. 

ఆస్ట్రేలియా - 10 ఐసీసీ ట్రోఫీలు

1987, 1999, 2003, 2007, 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లను ఆస్ట్రేలియా సాధించింది. 2021లో టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. 2006, 2009లో ఛాంపియన్స్ ట్రోఫీలు సాధించింది. అలాగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది.