తెలంగాణలో ఆడపడుచులా
అతి పెద్ద పండగ బతుకమ్మా..
ఈ బతుకమ్మా పండుగకు రాష్ట్రమంతా సందడిగా
ఉంటుంది.
అన్నల ప్రేమాభిమానాలతో చెల్లెలు సంతోషంగా జీవిస్తుంటే ఆడబిడ్డను చూసి ఈర్ష అసూయ ద్వేషాలతో వదినల మనస్సు మండిపోయేది.
ఆమెను ఎలాగైనా వదిలించుకుంటేనే తమకు మనశ్శాంతి లభిస్తుంది అని అందుకు తగిన సమయం కోసం వేచి చూసేవారు.
ఈక్రమంలో ఓ రోజు అన్నలు వేటకెళ్లారు. తమ భర్తలు ఎంతకీ తిరిగి రాకపోవడంతో వారికి ఓ చెడు ఆలోచన వచ్చింది.
తోటి కోడళ్లంతా కలిసి సదరు ఆడబిడ్డను ప్రతీ చిన్న విషయానికి తిడుతు. అలా ఆమెను చంపేసి ఊరి బయట పాతి పెట్టారు.
దీంతో ఆ ఆడబిడ్డా అడవి
తంగేడు చెట్టుగా పుట్టి విరగబూసింది.
పొంతనలేని సమాధానాలు చెప్పిన భర్యాలను చూసి అన్నదమ్ములందరికి డౌట్ వచ్చింది.
చెల్లెల్ని వెతుక్కుంటు ఇంటి నుంచి బయటికి వెళ్లి అలా తిరిగి తిరిగి ఓ చోట కూర్చొని చెల్లెలి గురించి మాట్లాడుకుంటూ.. బాధపడుతున్నారు.
అన్నదమ్ములు తన కోసం పడుతున్న బాధల్ని చూడలేని ఆ చెల్లెలు తంగేడు మొక్క రూపంలో తన మరణం గురించి వారికి చెప్పింది..
ఆ అన్నలు చెల్లెలికి ఏం కావాలో కోరుకొమ్మని అడుగగా ఈ తంగేడు పూలలో తనను చూసుకోమని, ప్రతి ఏటా బతుకమ్మ పేరుతో పండగ చేయమని చెప్పిందట..
Related Web Stories
దేవాలయాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా..
నవరాత్రి సమయంలో ఈ 9 కలలు వస్తే స్వర్ణకాలం ప్రారంభం.
నవరాత్రుల్లో అమ్మవారికి ఈ పువ్వులతో పూజ చేస్తే ఇంట్లో లక్ష్మి కటాక్షం.
బతుకమ్మ పండుగ 9 రోజుల నైవేద్యాలు తెలుసా..?