తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశేషాలు

ఎంగిలిపూల బతుకమ్మ :  పువ్వులలోని కాండాలను నోటితో తెంపినందున దీనికి ఈ పేరు వచ్చింది. నైవేద్యంగా నువ్వులు, బియ్యపు పిండి లేదా ముతక బియ్యపు పిండిని సమర్పిస్తారు.

అట్ల బతుకమ్మ: ఈ రోజు అట్లు లేదా దోశలను నైవేద్యంగా సమర్పిస్తారు.

ముద్దపప్పు బతుకమ్మ : పప్పును నైవేద్యంగా సమర్పిస్తారు.

నానేబియ్యం బతుకమ్మ:నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదిస్తారు.

బతుకమ్మ: ఈ రోజున కూడా పూలతో బతుకమ్మను అలంకరించి ఆడుకుంటారు.

అలిగిన బతుకమ్మ : ఈ రోజున నైవేద్యం సమర్పించరు.

వేపకాయల బతుకమ్మ : బియ్యం పిండిని బాగా వేయించి వేపకాయల ఆకారంలో తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

వెన్నముద్దల బతుకమ్మ:నువ్వులు, వెన్న, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.

సద్దుల బతుకమ్మ:పండుగ చివరి రోజు. ఈరోజు అనేక రకాల పదార్థాలను కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.