ఈమె దుర్గాదేవి యొక్క ఉగ్ర రూపం.

ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ప్రత్యేకంగా పూజిస్తారు.

రాక్షస రాజులైన శుంభ, నిశుంభలను సంహరించడానికి దేవతల నుండి ఉద్భవించిన దేవత శ్రీ మహా చండీ దేవి.

ఆమెను పూజించడం ద్వారా భక్తులు అన్ని రకాల దుష్ట శక్తులు,  దుష్ట గ్రహాల ప్రభావాలు, చెడు కార్యాల నుండి విముక్తి పొందుతారు

ఈమె ఆరాధన దీర్ఘకాలిక ఆరోగ్యం, సంపద, శ్రేయస్సును అందిస్తుంది.

దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారిని శ్రీ మహా చండీ దేవి రూపంలో అలంకరించి పూజిస్తారు.

దుర్గా సప్తశతిలోని శ్లోకాలు పఠించి, హోమాలు చేసి చండీ హోమం నిర్వహిస్తారు. 

ఈ హోమం చేయడం వల్ల దుష్ట శక్తుల నుండి బయటపడవచ్చు.