హైదరాబాద్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

సద్దుల బతుకమ్మ సంబరాలు జిల్లాలో సోమవారం అంబరాన్నంటాయి. మహిళలు తంగేడు, గునుగు, బంతి పూలతో బతుకమ్మలను తయారు చేసి గౌరమ్మను పూజించారు.

ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమామ.. రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉ య్యాలో అంటూ మహిళలు సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.

 పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మల్లో పెట్టి పూజలు చేసి నైవే ద్యాలను సమర్పించారు.

రాత్రి ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలు పెట్టి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.

చిన్నారులు, యువతులు, మహి ళలు నృత్యాలు చేస్తూ సంబరాలను నిర్వహించారు.

చిన్నారులు, యువతులు, మహి ళలు నృత్యాలు చేస్తూ సంబరాలను నిర్వహించారు.

అనంతరం బతుకమ్మను చెరువులో వదిలారు