వసంత పంచమి రోజే సరస్వతీ దేవి జన్మించినట్లు  పురాణాల ద్వారా తెలుస్తోంది.

ఈ రోజున బాసరలోని సరస్వతీ దేవి ఆలయంతో పాటూ అన్ని పాఠశాలల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

ఈ రోజు సరస్వతీ దేవిని పూజించిన వారికి పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.

పిల్లలకు ఈ రోజు అక్షరాభ్యాసం చేయించడం వల్ల మనసు ఏకాగ్రతతో ఉంటుంది.

వసంత పంచమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి

తలస్నానం చేసి పసుపు, తెలుపు దుస్తులు ధరించాలి.

పూజా స్థలం, మందిరాన్ని మంచి నీటితో శుభ్రం చేయాలి.

అమ్మవారి ఫొటో కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్టించి, పసుపు రంగులో ఉండే బట్టలను సమర్పించాలి.

పసుపు రంగులో ఉండే పువ్వులు, అక్షింతలు, చందనం, ధూపం, దీపం సమర్పించాలి.

అలాగే పసుపు రంగులో ఉండే మిఠాయిలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి.