దేశంలో జరిగిన అత్యంత విషాదకరమైన తొక్కిసలాట ఘటనలు ఇవే... 

భారతదేశ చరిత్రలో జరిగిన ఘోరమైన తొక్కిసలాటలో కొన్ని ప్రధానమైనవి తెలుసుకుందాం

కుంభమేళా, అలహాబాద్ (1954) భారతదేశ చరిత్రలో ఘోరమైన తొక్కిసలాటలో ఇది ఒకటి, సుమారు 800 మంది మరణించారు

శబరిమల, కేరళ (1999) శబరిమలై జరిగిన తొక్కిసలాటలో 53 మంది యాత్రికులు మరణించారు

చాముండా దేవి ఆలయం, జోధ్‌పూర్ (2008) నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 220 మందికి పైగా మరణించారు

అలహాబాద్ రైల్వే స్టేషన్ (2013) కుంభమేళా సందర్భంగా అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 36 మంది మృతి చెందారు

గోదావరి పుష్కరాలు, ఆంధ్రప్రదేశ్ (2015) గోదావరి మహా పుష్కరాలలో తొక్కిసలాటలో రద్దీ కారణంగా 27 మంది మృతి చెందారు

ముంబై తొక్కిసలాట (2017) ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్ రోడ్ ఫుట్‌బ్రిడ్జ్‌పై జరిగిన తొక్కిసలాటలో 23 మంది మరణించారు

హత్రాస్ స్టాంపేడ్ (2024) ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 116 మంది మరణించారు