మాఘమాసం - 2025 ముఖ్యమైన రోజులు

శుభకార్యాల మాసం.. మాఘ మాసం 2025

ఫిబ్రవరి 3వ తేదీ: మాఘ శుద్ద పంచమి / షష్టి : వసంత పంచమి

ఫిబ్రవరి 4వ తేదీ: మాఘ శుద్ధ సప్తమి: రథసప్తమి. తిరుమల శ్రీవారి ఆలయంలో సకల వాహన సేవలు.

ఫిబ్రవరి 8వ తేదీ: మాఘ శుద్ధ ఏకాదశి: భీష్మ ఏకాదశి.

ఫిబ్రవరి 12వ తేదీ: మాఘ శుద్ధ పౌర్ణమి: మాఘ పౌర్ణమి.. నదీ స్నానం.

ఫిబ్రవరి 18వ తేదీ: మాఘ బహుళ షష్ఠి: తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ఫిబ్రవరి 19వ తేదీ: మాఘ బహుళ సప్తమి: తిరుపతి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఫిబ్రవరి 26వ తేదీ: మాఘ బహుళ త్రయోదశి/చతుర్దశి: మహాశివరాత్రి పర్వదినం. తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సమాప్తం.

ఫిబ్రవరి 28వ తేదీ: మాఘ బహుళ అమావాస్య: తిరుపతి కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సమాప్తం