సాయిబాబా ఆలయంలో  ఒక అద్బుతమైన దృశ్యం.

చిత్తూరు కట్టమంచి సాయిబాబా ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదే సమయంలో సాయిబాబా ఆలయం వద్ద అద్భుత దృశ్యం కనువిందు చేసింది.

ఆలయంపై ఒక తెల్లని గద్ద చక్కర్లు కొట్టింది.

కుంభాభిషేకం జరుగుతున్న సమయంలో తెల్లని గద్ద కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

చాలా అరుదుగా కనిపించే ఈ గద్దను స్థానిక ప్రజలు ఎంతో ఆసక్తిగా చూశారు