ఇంట్లో ఈశాన్య దిశలో ఈ వస్తువు పెడితే   ధన ప్రవాహానికి మార్గం తెరచుకున్నట్లే!

శంఖాన్ని సరైన స్థలంలో ఉంచకపోతే, కొన్ని ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుందట

శంఖం ధ్వని ఎంత దూరం ప్రయాణిస్తే, అంతదూరం వరకు వాతావరణం అంత పవిత్రంగా మారుతుందని చెబుతున్నారు  పండితులు  

శంఖాన్ని ఎల్లప్పుడూ మీ పూజ గదిలో ఈశాన్య మూలలో ఉంచాలి.

ఈశాన్య దిశలో శంఖం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్నవారికి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది.

శంఖాన్ని దాని నోరు పైకి చూసేలా ఉంచాలి.

 ఇంట్లో శంఖాన్ని పెట్టుకోవ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ పెరుగుతుంద‌ని న‌మ్మ‌కం.

శంఖాన్ని ఊదడానికి ముందు దానిని గంగా జలంతో శుభ్రం చేయాలి.

 ఉపయోగించిన తర్వాత  శంఖాన్ని గంగా జలంతో కడిగి శుభ్రమైన గుడ్డతో తుడవాలి. 

పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి ఇవి