Today Horoscope : ఈ రాశి వారు పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

17-03-2025 సోమవారం

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవారంగాల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు) హోటల్‌, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. మెడికల్‌ క్లెయిములు మంజూరు అవుతాయి.

17-03-2025 సోమవారం

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. చిట్‌ ఫండ్‌, పాఠశాలలు, అడ్వర్టయిజ్‌మెంట్‌ రంగాల్లోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారుల విషయంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. పెట్టుబడుల విషయంలో పెద్దల సహకారం లభిస్తుంది.

17-03-2025 సోమవారం

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు) గృహ రంభ, ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. దూరంలో ఉన్న బంధుమిత్రులు ఇల్లు చేరుకుంటారు. పాస్‌పోర్ట్‌, వీసా పనులు పూర్తవుతాయి. కొంత కాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. సూర్యాష్టక పారాయణ శుభప్రదం.

17-03-2025 సోమవారం

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాల్లో తోబుట్టువులు సహకారం లభిస్తుంది. విద్య, ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. స్టేషనరీ, మార్కెటింగ్‌, రవాణా, విద్య రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

17-03-2025 సోమవారం

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు) శ్రీవారు, శ్రీమతికి సంబంధించిన విషయాల్లో శుభపరిణామాలు సంభవం. భాగస్వామ్యాలు లాభిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. బ్యాంకులు, ఫైనాన్స్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

17-03-2025 సోమవారం

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు) ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. వ్యాపార రంగంలో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. సిబ్బంది నియామకాలకు అనుకూలమైన రోజు. కేటరింగ్‌, ఫార్మా, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

17-03-2025 సోమవారం

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు) ప్రియతమలతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. మెయిల్‌, వాట్సాప్‌ సందేశాలు ఆనందం కలిగిస్తాయి. సూర్యదేవునీ ఆరాధన శుభప్రదం.

17-03-2025 సోమవారం

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు) బ్యాంకులు, సహకార సంఘాలు, ఫైనాన్స్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు సంబంధించిన ఒక నిర్ణయానికి వస్తారు. బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

17-03-2025 సోమవారం

మకరం డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ ప్రయత్నాల ఫలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. పై అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ముఖ్యమైన సమాచారం లభిస్తుంది. గౌరవ, మర్యాదలు అందుకుంటారు.

17-03-2025 సోమవారం

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. వేడుకలకు అవసరమైన నిధులు సర్దు బాటవుతాయి. పారితోషికాలు అందుకుంటారు. పెట్టుబడుల విషయంలో మీ అంచనాలు ఫలిస్తాయి. సూర్య భగవానుడి ఆరాధన శుభప్రదం.

17-03-2025 సోమవారం

12-12-2024  గురువారం

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు) వైద్యం, పరిశోధనలు, ఫార్మా, ఇన్సూరెన్స్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.