నవరాత్రి ఎనిమిదవ  రోజు దుర్గాష్టమి.

పురాణాల ప్రకారం మహా గౌరికి కొబ్బరికాయ అంటే ఇష్టం.

కనుక దుర్గా అష్టమి రోజున అమ్మవారికి కొబ్బరి పాయసాన్ని సమర్పించడం శుభప్రదం.

ఫుల్ క్రీమ్ పాలు,తాజా తురిమిన కొబ్బరి, బాస్మతి బియ్యం- 1/2 కప్పు 15-20 నిమిషాలు నానబెట్టినవి, చక్కెర లేదా బెల్లం 1/2 కప్పు

గిన్నెలో పాలు పోసి వేడి చేయండి. పాలు మరిగిన తర్వాత మంటను తగ్గించండి. మరిగిన పాలల్లో నానబెట్టిన బియ్యం పోసి బియ్యం ఉడికించండి.

బియ్యం అడుగున అంటుకోకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి.బియ్యం ఉడికి పాలు చిక్కగా అయిన తర్వాత తురిమిన కొబ్బరిని వేసి మరో 10 నిమిషాలు ఉడికించాలి.

చివరిగా బెల్లం, లేదా చక్కర వేసి యాలకుల పొడి, కుంకుమపువ్వు రేకలు వేసి బాగా కలపండి. బెల్లం కరిగిపోయే వరకు ఉడికించి స్టవ్ మీద నుంచి దింపి..బాణలి స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి బాదం, జీడిపప్పు, కిస్ మిస్, వేసి వేయించండి.

ఇలా వేయించిన డ్రై ఫ్రూట్స్ ని రెడీ చేసుకున్న కొబ్బరి పాయసం లో వేసి బాగా కలపండి. అంతే రుచికరమైన కొబ్బరి ఖీర్ రెడీ. దానిని చల్లబరిచి మహాగౌరి దేవికి సమర్పించండి.