మా ఇంటి దైవం వేంకటేశ్వర స్వామి: సీఎం చంద్రబాబు

దేవతల రాజధాని అమరావతి అయితే..... ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు.

కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఈ యుగంలో ఏపీలో అవతరించారని వ్యాఖ్యానించారు.

అమరావతిలో 2019లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేశామని గుర్తుచేశారు.

ఈ ప్రాంతానికి పేరు పెట్టినప్పుడే వేంకటేశ్వర స్వామి తన ద్వారా ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారని తెలిపారు.

కృష్ణానది తీరాన పవిత్రమైన వేంకటేశ్వరస్వామి దేవస్థానం నిర్మితమైందని పేర్కొన్నారు.

తిరుమలలో 1983లో అన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారని గుర్తుచేశారు.

2003లో ప్రాణదానం కార్యక్రమాన్ని స్విమ్స్‌లో తాను ప్రారంభించానని తెలిపారు సీఎం చంద్రబాబు. 

ఎప్పుడూ కూడా వేంకటేశ్వర స్వామికి అప్రతిష్టపాలు తెచ్చే పనిని తాను చేయనని చెప్పుకొచ్చారు.

వేంకటేశ్వరస్వామి వద్దకు ఎప్పుడు వెళ్లినా క్యూ లైన్ లోనే వెళ్తానని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. 

ముఖ్యమంత్రిగా కాకుండా... భక్తుడుగా తాను దేవుడు దగ్గరకు దర్శనం కోసం వెళ్తానని తెలిపారు సీఎం చంద్రబాబు. 

ఎవరూ తప్పుచేసినా  వేంకటేశ్వరస్వామి ఈ జన్మలోనే శిక్షిస్తారని  సీఎం చంద్రబాబు హెచ్చరించారు.