Today Horoscope: ఈ రాశి వారు ఉద్యోగ వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు

25-11-2025 మంగళవారం

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) వృత్తి, వ్యాపారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి మంచి ఫలితాలు సాధిస్తారు. దూరంలో ఉన్న బంధుమిత్రుల నుంచి మంచి సమాచారం అందుకుంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎగుమతులు, ఉన్నత విద్య, ప్రచురణలు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

25-11-2025 మంగళవారం

మిథునం ( మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు) శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగిస్తుంది. పెట్టుబడులు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు, స్టాక్‌మార్కెట్‌ లావాదేవీల్లో మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. మిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

25-11-2025 మంగళవారం

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు) భాగస్వామి సహకారంతో వృత్తిపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారంతో ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

25-11-2025 మంగళవారం

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ, వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం, హోటల్‌, క్రీడలు, అడ్వర్టయిజ్‌మెంట్‌, ఆడిటింగ్‌ రంగాల వారు ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

25-11-2025 మంగళవారం

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు) రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రియతముల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

25-11-2025 మంగళవారం

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు) కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త అందుకుంటారు. బదిలీలు, మార్పులకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు చర్చల నుంచి మంచి ఫలితాలు అందుకుంటారు.

25-11-2025 మంగళవారం

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు) ఫీజులు, పారితోషికాలు చేతికి అందుతాయి. ఆర్థిక లావాదేవీలకు అనుకూలమైన రోజు. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు సహకారం లభిస్తుంది. తోబుట్టవుల నుంచి శుభవార్త అందుకుంటారు. పెట్టుబడులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి.

25-11-2025 మంగళవారం

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాలకు సంబంధించిన కీలక నిర్ణయాలకు అనుకూలమైన రోజు. పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సంకల్పం నెరవేరుతుంది.

25-11-2025 మంగళవారం

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు) కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మనసుకు శాంతినిస్తాయి. ఉన్నద విద్య, విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. దూరప్రయణాలు ఆనందం కలిగిస్తాయి.

25-11-2025 మంగళవారం

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు) సినిమాలు, రాజకీయాలు, ప్రచురణలు, కళలు, సేవా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో గత అనుభవం తోడ్పడుతుంది. దూరప్రాంతంలో ఉన్న బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు.

25-11-2025 మంగళవారం

12-12-2024  గురువారం

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు) ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. పెద్దలు, ప్రముఖులను కలుసుకుంటారు. వారి సలహాలు లాభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. పలుకుబడిగల వ్యక్తుల సహకారంతో ఆర్థిక సంస్థలతో పనులు పూర్తి చేయగలుగుతారు.