రాబందులు చనిపోయిన జంతువుల కళేబరాలను తింటాయి. వ్యాధులు వ్యాపించకుండా అడ్డుకుంటాయి.

జంతువుల కళేబరాలను తినటం వల్ల డీకంపోజిషన్ ప్రాసెస్ వేగవంతం అవుతుంది. భూమికి మంచి పోషకాలు అందుతాయి.

రాంబందులు చనిపోయిన జంతువుల కళేబరాలను తినటం వల్ల జంతువులకు, మనుషులకు మేలు జరుగుతుంది. 

కుళ్లిన మాంసాన్ని తిన్నా కూడా వాటికి ఏమీ కాదు. ప్రమాదకరమైన బ్యాక్టీరియాను కూడా జీర్ణరసాలు నాశనం చేసి పడేస్తాయి.

కొన్ని రాబందు జాతులు కుళ్లిన మాంసాన్ని తిన్న తర్వాత శరీరాన్ని శుభ్రం చేసుకుంటాయి. 

రాబందుల కళ్లు చాలా చక్కగా పని చేస్తాయి. దూరంనుంచి కూడా కళేబరాలను చూడగలవు. 

రాబందులను కొన్ని ప్రాంతాల్లో చావుకు సంకేతంగా భావిస్తారు. 

రాబందులు అంతరించిపోతున్న జాతిలో ఉన్నాయి.