అన్నపూర్ణాదేవి అవతారంలో  భక్తులకు దర్శనమిస్తారు.

అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తే జీవితంలో అన్నానికి లోటుండదని, ఆకలిదప్పులు తొలగిపోతాయని చెబుతారు.

ఈ రూపంలో అమ్మవారు సకల జీవులకు ఆహారాన్ని అందించే తల్లిగా, సాక్షాత్తు పరమేశ్వరునికి కూడా భిక్ష పెడుతున్న భంగిమలో కొలువై ఉంటారు.

ఈరోజు అమ్మవారికి గారెలు, క్షీరాన్నం, దద్యోజనం వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు.

అమ్మవారిని పసుపు లేదా గంధం రంగు చీరతో అలంకరిస్తారు.

చేతిలో రసపాత్రను ధరించి, అన్నం అందించే రూపంలో జగన్మాత దర్శనమిస్తారు.