కూల్ డ్రింక్స్ బాటిల్స్ లో డ్రింక్ ఎందుకు పూర్తిగా నింపరో తెలుసా?
కూల్‌డ్రింక్స్‌ను మంది ఎంతో ఇష్టపడతారు. పిల్లలు నుంచి పెద్దలు వరకు, ప్రతి ఒక్కరూ సాఫ్ట్‌డ్రిక్స్ తాగడం ఇష్టపడతారు.
అంతే కాకుండా మార్కెట్‌లో కూడా అనేక రకాల కూల్ డ్రింక్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది తమకు నచ్చిన డ్రింక్ సెలక్ట్ చేసుకొని తాగుతుంటారు.
కూల్ డ్రింక్స్ లో ఒక్కో కూల్ డ్రింక్‌కు ఒక్కో కలర్ రంగుతో ఉంటుంది. ముఖ్యంగా దాని మూతలు డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి.
ఇక ఏ ఫంక్షన్, పార్టీ అయినా సరే కూల్ డ్రింక్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా. కూల్ డ్రిక్స్ బాటిల్స్ నిండుగా ఉండవు.
అసలు కూల్ డ్రింక్ బాటిల్స్ లో డ్రింక్ ఎందుకు పూర్తిగా నింపరు, దానికి కారణం ఏంటి? అనే దాని గురించే మనం వివరంగా తెలుసుకుందాం.
కూల్ డ్రింక్స్‌లల్లో కార్బోనేటేడ్ వాటర్‌ని కార్బన్ డయాక్సై్ గ్యాస్‌తో మిక్స్ చేస్తారు. అయితే గ్యాస్ బాటిల్‌లో పెట్టడానికి డ్రింక్ ను తగ్గించి బాటిల్లో పస్తారంట.
అలా కాదని కార్బన్ డయాక్సైడ్ కోసం ఖాళీ లేకుండా నిండుగా డ్రింక్ ని పోస్తే బాటిల్ పేలిపోయే ఛాన్స్ ఉంటదంట.అధిక ఉష్ణోగ్రత ఉన్న సమయంలో కాళీ లేకపోతే బాటిల్ పగిలిపోతుందని గ్యాప్ వదిలేస్తారు.
ఇలా చేయడం వల్ల కూల్ డ్రింక్స్ పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి.