చలి కాలంలో చేయకూడని 7 పనులు
చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తక్షణం తగ్గుతుంది, ఫలితంగా జలుబు, దగ్గు, జ్వరం రావచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.
నీరు తక్కువ తాగడం వల్ల చర్మం ఎండిపోవడం, అలసట వంటి సమస్యలు వస్తాయి.
వెలుగుతిరగక ముందే బయటకు వెళ్లడం వల్ల చల్లటి గాలితో శ్వాసకోశ సమస్యలు రావచ్చు.
నూనె, మసాలా, ఫ్రైడ్ ఫుడ్ తినడం వల్ల శరీరంలో వేడి పెంచి జీర్ణ సమస్యలు, కొవ్వు పెరగడం వంటి సమస్యలకు కారణమవుతాయి.
శరీరానికి చెమటలు పట్టిన తర్వాత ఆ దుస్తులు అలాగే ఉంచితే చలి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే పొడి దుస్తులు మార్చుకోవాలి.
సూర్యరశ్మి వల్ల విటమిన్ D లభిస్తుంది. దీని లోపం వల్ల ఎముకలు బలహీనమవుతాయి. కనీసం రోజుకు 15–20 నిమిషాలు సూర్యరశ్మిలో ఉండటం మంచిది.
చలికాలంలో శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. తగినంత నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
Related Web Stories
జుట్టు పొడవుగా, దట్టంగా కావాలంటే ఈ ఒక్క జ్యూస్ తాగండి చాలు..!
దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు రాకుండా ఉండాలంటే..
పిల్లలు పుట్టకపోవడానికి ఈ అంశాలే అసలు కారణాలు..!
30 ఏళ్లు దాటిన వారికి ఈ పోషకాలు అవసరం..