ప్రస్తుత బిజీ జీవితంలో ఇంట్లో వంట చేసుకోవడం కష్టంగా మారింది.

ఒకేసారి ఎక్కువ మొత్తంలో సగం కాల్చి తయారుచేసి పెట్టుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

 కొత్తిమీర, పుదీనా, మెంతి వంటివి కట్‌ చేసుకొని పెట్టుకునే  ఓ గ్లాస్‌ నీటిలో కాడలు మునిగేలా ఉంచి ఫ్రిజ్‌లో పెట్టేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని రోజుల పాటు తాజాగా ఉంటాయని తెలిపారు. ఎప్పుడంటే అప్పుడు,ఎంత కావాలంటే అంత కూరల్లో తరిగి వేసుకుంటే సరిపోతుంది.

జ్యూసులు, స్మూతీస్‌ తయారు చేసుకోవాలనుకున్న ప్రతిసారీ పండ్లను ముక్కలుగా కట్‌ చేసుకోవడం వీలు కాకపోవచ్చు.

ముందే ఏ పండుకా పండు ముక్కలు చేసుకొని.. వాటిని సెపరేట్‌గా ఫుడ్‌ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్లో పెట్టేయాలని తెలిపారు. 

మాంసంతో చేసే కొన్ని రకాల వంటకాల కోసం వాటిని సన్నటి సైజుల్లా కట్ చేస్తుంటారు.

ఈ క్రమంలో ఇవి జారిపోకుండా,చక్కగా కట్‌ కావాలంటే వాటిని ఓ అరగంట పాటు ఫ్రీజర్‌లో ఉంచితే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు

గుడ్లపై పెంకులు తీసేందుకు ఉడికించేటప్పుడే నీటిలో కొద్దిగా బేకింగ్‌ సోడా లేదంటే వెనిగర్‌ వేస్తే పెంకులు తీయడం సులువుగా మారుతుందని చెబుతున్నారు.