బ్లాక్ కాఫీ vs మిల్క్ కాఫీ:  రెండింటిలో ఏది మంచిది? 

బ్లాక్ కాఫీలో క్యాలరీలు ఉండవు. బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఒక్క క్యాలరీ కూడా శరీరంలోకి చేరదు. 

పాలు కలిపే శాతాన్ని బట్టి మిల్క్ కాఫీలో క్యాలరీలు ఉంటాయి. సగటున 30-50 క్యాలరీలు ఒక్క కప్ మిల్క్ కాఫీ వల్ల అందుతాయి. 

ఒక కప్పు మిల్క్ కాఫీ వల్ల 1-1.5 గ్రాముల ఫ్యాట్ అందుతుంది. బ్లాక్ కాఫీలో ఫ్యాట్ శాతం సున్నా. 

మిల్క్ కాఫీ ద్వారా 1-2 గ్రాముల ప్రోటీన్ శరీరానికి అందుతుంది. బ్లాక్ కాఫీలో ఎలాంటి ప్రోటీన్లూ ఉండవు. 

మిల్క్ కాఫీ ద్వారా 3-6 గ్రాముల కార్బోహైడ్రేట్స్ శరీరానికి అందుతాయి. బ్లాక్ కాఫీలో కార్బోహైడ్రేట్లు ఉండవు. 

బ్లాక్ కాఫీలో 0.5 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. మిల్క్ కాఫీ ద్వారా ఫైబర్ అందదు. 

బ్లాక్ కాఫీ, మిల్క్ కాఫీ రెండింటిలోనూ యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి. 

మిల్క్ కాఫీలో షుగర్, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. బ్లాక్ కాఫీలో అలాంటివేవీ ఉండవు. 

మీకు కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, షుగర్ వద్దనుకుంటే బ్లాక్ కాఫీ మంచి ఆప్షన్. అయితే రుచితో పాటు కాస్త ప్రోటీన్ కూడా కావాలంటే మిల్క్ కాఫీ తీసుకోండి.