ఉల్లిపాయల్ని కోసేటప్పుడు  కన్నీళ్లు రాకుండా ఉండాలంటే..!

ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రావడానికి ఉల్లిపాయలలో లాక్రిమేటరీ-ఫాక్టర్ సింథేస్ ఎంజైమ్‌లు ఉంటాయి.

మనం ఉల్లిపాయలను కోసినప్పుడు, ఈ ఎంజైమ్‌లు విడుదలై మన కళ్లపై ప్రభావం చూపుతాయి.

 దీని కారణంగా  కళ్ల నుండి కన్నీళ్లు వస్తాయి. 

ఉల్లిపాయ పొట్టు తీసిన తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసి 10 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టాలి.

ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలో ఉండే కన్నీటిని కలిగించే రసాయనం తొలగిపోయి ఉల్లిపాయను కోసేటప్పుడు కన్నీళ్లు రావు. 

 చూయింగ్ గమ్‍ను నోటిలో పెట్టుకుని, ఉల్లిపాయలు కోసేటప్పుడు నమలుతూ ఉండండి.

ఇలా చేయడం వల్ల కళ్లలో చుక్క కన్నీరు కూడా రాదు.