సగ్గుబియ్యం వడలు ఇలా చేసారంటే
చాలా రుచి గా క్రిస్పీగా ఉంటాయి..
సగ్గుబియ్యాన్ని ముందు రోజు రాత్రి నానబెట్టి ఉదయాన్నే నీటిని వడకట్టాలి.
ఆలుగడ్డల్ని ఉడికించిపెట్టుకోవాలి. వేరుశనగ పప్పును వేయించి కచ్చపచ్చాగా రుబ్బుకోవాలి.
ఓ గిన్నెలోకి సగ్గుబియ్యం, ఆలుగడ్డ, వేరుశెనగ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, చక్కెర, ఉప్పు, తగినంత నీరు వేసి బాగా కలపాలి.
కడాయిలో నూనె వేడిచేసి చేతివేళ్లతో వడల్లాగా వత్తుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి.
ముదురు గోధుమ రంగులోకి మారాక బయటకు తీయాలి.
అంతే.. ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం వడలు రెడీ. చివర్లో కొత్తిమీరతో గార్నీషింగ్ చేసుకోండి.
Related Web Stories
కరకరలాడే వేడి వేడి మీల్ మేకర్ పకోడీ సింపుల్గా ఇలా చేసుకోండి!
ప్రపంచంలో సూర్యుడు అస్తమించని ప్రాంతాలు ఇవే..
కర్ణాటకలో తప్పక చూడాల్సిన 10 ప్రదేశాలు
సూపర్ టేస్టీ సగ్గుబియ్యం దోశలు నిమిషాల్లో చేసుకోండిలా..