కరకరలాడే వేడి వేడి మీల్ మేకర్ పకోడీ సింపుల్‌గా ఇలా చేసుకోండి!

కావాల్సిన పదార్థాలు.. మీల్‌మేకర్, కారం పొడి, ధనియాల పొడి, పసుపు, పెరుగు, జీలకర్ర పొడి, గరం మసాలా, కరివేపాకు

ఓ గిన్నెలో గోరువెచ్చని నీళ్లు పోసుకోని. అందులో మీల్‌మేకర్ వేసి నానబెట్టండి

పెరుగులో కారం పొడి, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి.

జీలకర్ర పొడి, సన్నగా తరిగిన కరివేపాకు, కొద్దిగా మొక్కజొన్న పిండి వేసి బాగా కలుపుకోవాలి.సరిపడా ఉప్పు వేయాలి

 నానబెట్టుకున్న మీల్ మేకర్ మసాలాలు మీల్ మేకర్లకు పట్టేవరకు బాగా కలుపుకోవాలి.

 స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి బాగా వేడి చేసుకోండి.

వేడి అయ్యాక ఈ పిండిని పకోడీల్లా చేసుకుని వేయండి. రెండువైపులా బాగా కాల్చుకోండి.

అంతే.. రుచికరమైన మీల్ మేకర్ పకోడీ రెడీ