చల్లమిరపకాయలును మజ్జిగ  మిరపకాయలు అని పిలుస్తారు.

సాంబారు,పప్పు అన్నం,పెరుగన్నంతో పాటు చల్లమిరపకాయలు ఉండాల్సిందే.ఊర మిరపకాయల కోసం కారం తక్కువగా ఉన్న మిరపకాయలు తీసుకోవాలి

ముందుగా పచ్చిమిరపకాయలను తొడిమలు తీయకుండానే శుభ్రంగా నీటిలో కడిగి గిన్నెలో వేసుకోవాలి.

మధ్యలోకి రెండు ముక్కలుగా కట్ చేసుకుని వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి.

ఉప్పు, నిమ్మరసాన్ని వేసుకుని బాగా కలపాలి. ఇక్కడ ఉప్పు ఎక్కువగా వేయకుండా కొద్దిగా వేసుకోవాలి.

బాగా కలిపి గాజు సీసా లేదా ప్లాస్టిక్​ కంటైనర్లో మూడు రోజులపాటు ఊరబెట్టాలి ఈ సమయంలో పైకి కిందకి మిరపకాయలను కలిపి ఆ నీటిని రుచి చూడండి.

ఉప్పు తక్కువైంది అనిపిస్తే కొద్దిగా వేసుకోండి ఊరమిరపకాయల్లో ఉప్పు ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. 

మూడు రోజులపాటు ఊరబెట్టుకున్న మిరపకాయలను నాలుగవ రోజు ఓ క్లాత్​పై పలుచగా వేసుకుని ఎండకు ఆరబెట్టుకోవాలి.

ఊర మిరపకాయలు 3 నుంచి 5 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. ఇన్ని రోజులపాటు ఊర మిరపకాయలను ఎండబెట్టుకోవడం వల్ల బాగా ఎండుతాయి.