నిద్ర విషయంలో కొన్ని అపోహలను తప్పనిసరిగా తొలగించుకోవాలి

రోజుకు 5 గంటల రాత్రి నిద్ర సరిపోతుందని అనుకోవద్దు. కనీసం 7-8 గంటల నిద్ర కావాలి

గురక హాని రహితం కాదు. స్లీప్ యాప్నియాకు ఒక ప్రధాన సంకేతం

రాత్రి నిద్ర చాలకపోతే పగటి నిద్రతో లోటును భర్తీ చేయొచ్చని భావించడం తప్పు

ఆల్కహాల్‌తో నిద్ర బాగా పట్టకపోగా పైపెచ్చు డీప్‌ స్లీప్‌కు ఆటంకాలు ఏర్పడతాయి

టీవీ చూస్తేనే నిద్రొస్తుందన్న భావన తప్పు. టీవీ వెలుతురులోని నీలి కాంతి మెలటోనిన్‌ను అడ్డుకుని నిద్రను చెదరగొడుతుంది.

వృద్ధులకు తక్కువ నిద్ర సరిపోతుందన్న భావన తప్పు. వారికీ 8 గంటల నిద్ర తప్పనిసరి

ఈ అపోహలను తొలగించుకుంటేనే కంటి నిండా నిద్రపోగలుగుతారు.