బెల్లం vs పంచదార: రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది..
ఆహారానికి తీపి రుచిని అందించేందుకు బెల్లం లేదా పంచదారాను చాలా మంది వాడుతుంటారు. అయితే రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది
పంచదారతో పోల్చుకుంటే బెల్లాన్ని చాలా తక్కువగా ప్రాసెస్ చేస్తారు. అందువల్ల బెల్లంలో పోషకాలు ఉంటాయి.
రిఫైండ్ చేసిన పంచదారలో రుచి, శక్తిని అందించే గ్లూకోజ్ మాత్రమే ఉంటుంది.
బెల్లంలో శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి.
బెల్లం సహజ సిద్ధమైన లాక్సాటివ్‌గా పని చేస్తుంది. ఇది జీర్ణక్రియను ప్రోత్సహించి మలబద్ధకాన్ని నివారిస్తుంది.
బెల్లంలోని ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.
బెల్లం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ గల ఆహార పదార్థం. ఒకేసారి రక్తంలో చక్కెర స్థాయులను పెంచదు.
పంచదార గ్లైసెమిక్ ఇండెక్స్ అత్యధిక స్థాయిలో ఉంటుంది. తిన్న వెంటనే రక్తంలో చక్కర స్థాయిలు పెరిగిపోతాయి.
ప్రస్తుతం షుగర్, ఊబకాయం, గుండె జబ్బులు వంటి లైఫ్‌స్టైల్ వ్యాధులు పెరిగిపోవడానికి రిఫైన్డ్ చేసిన పంచదారేతో చేసిన పదార్థాలను తినడమే కారణం.
Related Web Stories
రక్తప్రసరణ సాఫీగా సాగాలా.. యోగాతో సాధ్యమే..
పర్ఫ్యూమ్ బాటిల్‌పై EDT, EDP, EDC అని రాస్తారు? వీటి అర్థాలేంటో ఏంటో తెలుసా?
భారతదేశంలో అత్యంత ఖరీదైన 10 నగరాలు ఇవే..
ఇంట్లో ఒక చిన్న నెమలి ఈకను పెట్టుకోండి.. మీ సంపద అమాంతం పెరుగుతుంది!