యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్  చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.

నారింజ, ద్రాక్షపండ్లు, నిమ్మకాయలు, సిట్రస్ పండ్లలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.

బ్లూబెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.

ఇవి చర్మకణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

 బ్రోకలీలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉన్నాయి.

చర్మాన్ని రక్షించే ల్యూటిన్ ఇందులో ఉంటుంది.

అవకాడోలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి.

చిలకడదుంపల్లో బీటా కెరోటిన్,. విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి నిగారింపుని, చర్మ కణాల ఉత్పత్తికి సహకరిస్తాయి.