చదివింది గుర్తుండాలంటే..  ఈ చిట్కాలను  పాటించండి చాలు.. 

మీరు చదివింది లేదా చర్చించుకున్నది గుర్తుండాలంటే.. ప్రతి అంశాన్నీ దృశ్య రూపంలోకి మార్చుకోవాలి. 

మీరు ఎంచుకున్న అంశాన్ని మొత్తం వివిధ భాగాలుగా విభజించుకోవాలి. 

ఒక పదం లేదా లైన్ అర్థం కాకుంటే.. మళ్లీ చదివి అర్థం చేసుకోవాలి. పదే పదే పునరావృతం చేయడం ద్వారా గుర్తుంచుకోగల సామర్థ్యం పెరుగుతుంది.

 మీరు నేర్చుకున్న అంశాలను చిత్రాల రూపంలో గీసుకోవాలి. కొత్తగా నేర్చుకున్న అంశాలన్నింటినీ అందులో జత చేస్తూ ఉండాలి.

అర్థం కాని లైన్ లేదా పదాన్ని చదువుతున్నప్పుడు.. దాని కింద పెన్సిల్‌తో గీతను గీయాలి. తర్వాత దాని అర్థాన్ని తెలుసుకుంటే సమస్య ఉండదు.

మీరు చదివిన అంశంపై ఇతరులతో చర్చించండి. అలాగే మీరు నేర్చుకున్న వాటిని స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతోనూ చర్చిస్తూ ఉండాలి.

రాత్రి వేళల్లో తగినంత సమయం నిద్రపోవాలి. అప్పుడే మీరు చదివింది గుర్తుండడానికి అవకాశం ఉంటుంది.