ఇటీవల కాలంలో యువకుల్లో గుండె సంబంధించిన మరణాలు బాగా పెరిగిపోతున్నాయి

ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఉన్నట్టుండి కార్డియాక్ అరెస్ట్ తో కుప్పుకూలిపోతున్నారు

యువకుల్లో గుండె సంబంధింత సమస్యలు, మరణాలకు ప్రధాన కారణం వారి జీవన శైలి అంటున్నారు డాక్టర్లు

ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం అంటే కంప్యూటర్ ముందు, సెల్ పోన్లలో గడపడం వంటివి చేస్తుంటారు

ఆహారంపై శ్రధ్ధపెట్టకుండా.. ఆకలైనప్పుడు ఏదో ఒకటి అని జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటుంటారు

ప్రాసెస్ చేయబడిన ఫుడ్ లో ఎక్కువ చక్కెరలు, బ్యాడ్ కొలెస్ట్రాల్, సోడియం అధికంగా ఉంటుంది

ఇది గుండె సంబంధ రోగాలను పెంచేందుకు ప్రధాన కారణమవుతాయి

దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి

ఒత్తిడి వలన కార్టిసాల్ అనే హార్మోన్లు విడుదలకు దారి తీస్తుంది

దీని వలన గుండె ఆరోగ్యం దెబ్బతీని కార్డియాక్ అరెస్ట్ లకు దారి తీసే అవకాశం ఉంది