చెవుల్లో ఇయర్ బడ్స్ తో తెగ తిప్పుతున్నారా.. జర భద్రం..!

  చెవుల్లో వుండే వ్యర్థాన్ని చెవులే సెల్ఫ్​ క్లీనింగ్ చేసుకుంటాయట.అందువల్ల మనం ప్రత్యేకంగా వ్యర్థాన్ని తొలగించుకోవాల్సిన అవసరం లేదని తాజా అధ్యయనంలో తేలింది. 

  ఇయర్ బడ్స్ తాకిడికి మరింత లోపలికి వెళ్లి ఇయర్ కెనాల్ నుంచి ప్రయాణించే కర్ణభేరిపై పడుతుందని పరిశోధకులు అంటున్నారు

ఎక్కువ మొత్తంలో గులిమి కర్ణభేరిపై పేరుకుపోతే.. కర్ణభేరి పనికి ఆటంకం కలిగించడం వలన చెవుడు వస్తుందట

ఇయర్‌వాక్స్‌ను తీయడానికి అస్తమానూ ప్రయత్నిస్తే.. శాశ్వత వినికిడి నష్టానికి దారితీస్తుంది. 

 అస్తమానూ చెవిని ఇయర్ బర్డ్స్ తో కదిపితే అది చెవిని చిల్లులు చేస్తుంది, దీనివల్ల విపరీతమైన నొప్పి, ఇన్ఫెక్షన్ వస్తుంది

 సున్నిత ప్రాంతాలలో స్క్రాప్ చేయడం రక్తస్రావం కలిగిస్తుంది.

 ఇయర్‌వాక్స్‌ను మృదువుగా చేయడంలో సహాయపడే ఓవర్ ది కౌంటర్ క్లీనింగ్ డ్రాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో అప్పుడప్పుడూ చెవులను శుభ్రం చేయవచ్చు.