Cycling: సైకిల్ తొక్కడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
సైకిల్ తొక్కడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
సైకిలింగ్ వల్ల మంచి వ్యాయామం అవుతుంది. మానసికంగా ధృడంగా ఉంటారు.
సైక్లింగ్‌తో శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎండార్ఫిన్స్ విడుదల అధికమవుతోంది. ఇది మానసిక ఒత్తిడి తగ్గేంచేందుకు ఉపయోగపడుతుంది.
సైక్లింగ్ వల్ల ఆందోళన, డిప్రెషన్ కూడా తగ్గుతాయని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. మానసిక సమస్యలతో బాధపడే వారు సైక్లింగ్ చేస్తే త్వరగా ఉపశమనం లభిస్తోంది.
రెగ్యులర్‌గా సైక్లింగ్ చేస్తే కండరాలు పెరిగేందుకు తోడ్పడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్‌గా సైక్లింగ్ చేయడం మంచి వ్యాయామం. సైక్లింగ్‍తో క్యాలరీ ఎక్కువగా బర్న్ అవుతాయి. ఇది వెయిట్ లాస్‍కు ఉపకరిస్తుంది.
కీళ్లు, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్న వారు డాక్టర్ సలహాతో సైకిల్ తొక్కాలి. ఆయా నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తోంది.
సైక్లింగ్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రోజూ సైకిల్ తొక్కితే హైబీపీ సైతం తగ్గుతుంది. బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
సైకిలింగ్ జీవక్రియ రేటును మెరుగు పరుస్తుంది. శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. ప్రతిరోజూ సుమారు 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే.. ఒక ఏడాదిలో దాదాపు ఐదు కేజీల కొవ్వు కరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.