డయాబెటిస్‌కు చికిత్స ఆలస్యమైతే ఏమవుతుంది.. 

మధుమేహానికి చికిత్స పొందడం ఆలస్యం అయితే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. 

దీని వలన శరీరంలోని అవయవాలు, కణజాలాలు దెబ్బతింటాయి.

అధిక రక్తంలో చక్కెర స్థాయిలు గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.

మధుమేహానికి సరిగ్గా చికిత్స చేయకపోతే అది కిడ్నీల పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. చివరికి పనిచేయని స్థితి వచ్చేలా చేస్తుంది.

డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కంటి చూపు దెబ్బతింటుంది. 

శరీరంలో పెరిగిన షుగర్ నరాల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. తిమ్మిరి, జలదరింపు, విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది.

టైప్ 1 డయాబెటిస్ ఉంటే శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేని ఆటో ఇమ్యూన్ పరిస్థితి తలెత్తుంది.

అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి జీవితాంతం ఇన్సులిన్ అవసరం .

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు మందులు, ఆహారం లేదా వ్యాయామం ద్వారా కూడా రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు. 

ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే డాక్టర్ సలహాతో ఇన్సులిన్ తీసుకోవాలి.