తుమ్ము వచ్చినప్పుడు ఈ తప్పు  అస్సలు చేయకండి..

 నలుగురిలో ఉన్నప్పుడు కొందరు మొహమాటం కొద్దీ తుమ్ము ఆపుకుంటూ ఉంటారు. ఇలా చేయొద్దని వైద్యులు చెబుతున్నారు

తుమ్మేటప్పుడు శ్వాసకోస వ్యవస్థలో తీవ్ర ఒత్తిడి పుడుతుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో గాలి బయటకొస్తుంది.

తుమ్ము ఆపుకుంటే శ్వాసకోస వ్యవస్థల్లో పీడనం సాధారణం కంటే 24 రేట్లు అధికమవుతుంది.

ఇలా పెరిగిన పీడనంతో చెవిలోని కర్ణభేరి బద్దలవ్వొచ్చని వైద్యులు చెబుతారు. దీన్ని సరిచేసేందుకు ఒక్కోసారి సర్జరీ చేయాల్సి వస్తుంది.

ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి కన్ను, ముక్కు, చెవిలోని సన్నటి రక్తనాళాలు కూడా పగలొచ్చు. ఫలితంగా ముక్కూ, కళ్లు ఎర్రబడినట్టు కనిపిస్తాయి.

కొన్ని అసాధారణ సందర్భాల్లో ఊపిరి తిత్తులు కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుందట.

తుమ్ము ఆపుకుంటే గొంతు కూడా దెబ్బతినే అవకాశం ఉంది.

తుమ్ము ఆపుకున్న కొందరిలో పక్కటెముకలు కూడా విరిగిన సందర్భాలు ఉన్నాయి.