ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఏం జరుగుతుందంటే..!

ఉదయాన్నేఖాళీ కడుపుతో టీ తాగడం చాలామంది అలవాటు.  దీని వల్ల ఆరోగ్యానికి నష్టాలున్నాయి.

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అజీర్ణం,  గ్యాస్,   ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.

ఖాళీ కడుపుతో టీ తాగితే కొందరిలో కడుపు నొప్పి వస్తుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు నోటిలోని బ్యాక్టీరియా చక్కెరను విచ్చిన్నం చేస్తుంది.  ఇది యాసిడ్ స్థాయిని పెంచి దంతాల ఎనామిల్ ను దెబ్బతీస్తుంది.

చాలామంది తలనొప్పిగా అనిపిస్తే టీ తాగుతారు. కానీ ఖాళీ కడుపుతో టీ తాగితే తలనొప్పి వస్తుంది. కొందరిలో అనారోగ్యం కూడా చేస్తుంది.

టీ లో థియోఫిలిన్ అనే పదార్థం ఉంటుంది.  ఇది నిర్జలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.  ఇది శరీరాన్ని డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది.  దీనివల్ల తలనొప్పి, మలబద్దకం వస్తాయి.

టీలో టానిన్లు,  కెఫీన్ వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి.  ఉదయాన్నే టీ తాగితే ఐరన్ వంటి పోషకాలను గ్రహించడాన్ని నిరోధిస్తుంది.