చిన్నారుల్లో కంటి సమస్యలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు పిల్లల కోసం కొన్ని టిప్స్ సూచిస్తున్నారు.

దృష్టి దోషం ఉన్న చిన్నారులు నిరంతరం కళ్లద్దాలు వినియోగించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. దీంతో, సమస్య ముదరకుండా ఉంటుంది.

కంటిపై ఒత్తిడి ఎక్కువ కాకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల వినియోగాన్ని వీలైనంత తగ్గించాలి

తరచూ కళ్లునలుముకోకుండా ఉంటే కంటి ఇన్ఫెక్షన్ల అవకాశాలు తగ్గుతాయి

విటమిన్ ఏ, సీ, ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం పిల్లల దృష్టిలోపాన్ని కొంత వరకూ తగ్గిస్తుంది

హ్రస్వద్రూష్టి పెరగకుండా ఉండేందుకు పిల్లలు ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి

చదువుకునేటప్పుడు కళ్లపై ఒత్తిడి లేకుండా ఉండేందుకు పుస్తకాన్ని కంటికి కనీసం 40 సెంటీమీటర్ల దూరంలో ఉండేలా జాగ్రత్తపడాలి.

వెలుతురు ఎక్కువగా ఉన్న చోట చదువుకుంటే కళ్లపై ప్రతికూల ప్రభావం తగ్గుతుంది 

కంటి చూపును కాపాడుకునేందుకు చిన్నారులకు రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి