మీ లివర్‌కు సహాయపడే.. సూపర్ ఫుడ్స్ ఇవే.. 

వెల్లుల్లి లివర్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తుంది. అలాగే వెల్లుల్లిలోని సెలేనియం, అలిసిన్ కాంపౌండ్స్ లివర్‌ను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి. 

యాంటీ-ఆక్సిడెంట్లను, నైట్రేట్లను పుష్కలంగా కలిగి ఉండే బీట్‌రూట్ లివర్ కణాలను కాపాడుతుంది. 

పాలకూర, బచ్చలకూర వంటి ఆకుకూరలు క్లోరోఫిల్‌ను అధికంగా కలిగి ఉండి శరీరంలోకి చేరిన హెవీ మెటల్స్‌ను న్యూట్రలైజ్ చేసి కాలేయంపై ఒత్తిడి తగ్గిస్తాయి. 

పసుపులోని కర్కుమిన్ కాలేయం వాపును అరికడుతుంది. పసుపు లివర్‌కు సూపర్ స్టార్‌లాంటిది. 

గ్రీన్ టీలోని కెటాచిన్స్ లివర్‌లో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయి. 

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలను, గ్లుటాథయోన్‌‌ను కలిగి ఉండే వాల్‌నట్స్ శరీరంలోని అమ్మోనియోను బయటకు పంపించి లివర్‌కు మద్దతుగా నిలుస్తాయి. 

అవకాడోలోని ఆరోగ్యకర కొవ్వులు, యాంటీ-ఆక్సిడెంట్లు లివర్ కణాలను రిపేర్ చేస్తాయి. 

పెక్టిన్‌ను అధికంగా కలిగి ఉండే ఆపిల్స్ లివర్ వర్క్‌లోడ్‌ను తగ్గిస్తాయి. 

నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ ఫలాలు లివర్ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి లివర్‌ను డీటాక్సిఫై చేస్తాయి.