ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి,ఆందోళనతో చాలామంది టైంకి నిద్రపోరు.
చిన్నతనంలో చాలామంది తల్లులు హాయిగా నిద్రపోయేందుకు పాలు ఇస్తారు
పిల్లలకు కొన్నిసార్లు పసుపు పాలతో పాటు కుంకుమపువ్వు బెల్లం కలిపిన పాలను కూడా తాగిపిస్తారు
ఈ రెసిపీని పాలతో కాకుండా బాదం పాలతో తయారు చేస్తారు.
ఒక కప్పు బాదం పాలు, 2 చిటికెడు దాల్చిన చెక్క పొడి, 1/4 టీస్పూన్ పసుపు , కొంచెం అశ్వగంధ పొడి, రెండు చిటికెడు యాలకుల పొడి, 1 స్పూన్ కొబ్బరి నూనె, 1 టీస్పూన్ తేనె, 1 చిటికెడు నల్ల మిరియాల పొడి వేసి తయారుచేయాలి.
తక్కువ మంట మీద బాదం పాలను వేడి చేసి పాలు బాగా వేడిగా మరిగిన తర్వాత తేనె తప్ప మిగిలిన అన్ని అందులో వేసి కాసేపు మంటపై ఉంచలి.
పాలు కొద్దిగా వెచ్చగా అయినా తర్వాత జల్లెడ పట్టి తేనెను జోడించాలి. ఆ తర్వాత ఆ పాలను తాగండి.
అనంతరం బ్రష్ చేసి నిద్రపోతే పళ్లు పసుపు రంగులోకి మారకుండా ఆరోగ్యంగా ఉంటాయి. కొన్ని రోజుల పాటు దీన్ని నిరంతరం తీసుకోవడం వల్ల త్వరగా నిద్ర వస్తుంది.
నిద్రపోయే ముందు బెల్లంపాలు, పసుపు పాలు, కుంకుమపువ్వు అధికంగా ఉండే పాలను తీసుకోండి. ఈ పానీయాన్ని సిద్ధం చేసుకొని నిద్రపోయే ముందు తాగితే హాయిగా నిద్రపడుతుంది.
నిద్రపోయే ముందు తలకు మసాజ్ చేస్తే శరీరం రిలాక్స్ అయ్యి నిద్ర హాయిగా త్వరగా పడుతుంది