ఈ సమస్యలతో బాధపడేవారు.. దానిమ్మ తింటే.. డేంజర్..

దానిమ్మ కాయ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్య నుంచి బయట పడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతారు. 

దీనిలోని పోషకాలు, విటమిన్లు.. శరీరానికి మేలు చేస్తాయి.

కానీ కొంత మంది దానిమ్మ కాయ తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు.

అలర్జీలతో బాధపడే వారు వీటిని తీసుకోకుండా ఉండమే ఉత్తమమని పేర్కొంటున్నారు.

లోబీపీ సమస్యతో బాధ పడే వారు కూడా దానిమ్మకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

రక్తం పలుచ బడడం కోసం మందులు వాడే వారు సైతం దానిమ్మను తీసుకోవద్దని అంటున్నారు.

మధుమేహ రోగులు వీటిని పరిమితంగా మాత్రమే తినాలని.. అధికంగా తీసుకుంటే చక్కెర స్థాయిలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు.  

ఉదర సమస్యలతో బాధ పడే వారు.. సైతం వీటిని తీసుకోకూడదని చెబుతున్నారు. 

గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడే వారు దానిమ్మపండు తినకూడదు. 

వైరల్ ఇన్ఫెక్షన్ లేదా దగ్గుతో బాధపడే వారు కూడా దానిమ్మ తీసుకోకూడదు.

మానసిక అనారోగ్యంతో బాధపడుతూ.. మందులు తీసుకుంటుంటే.. వారు సైతం దానిమ్మకు దూరంగా ఉండాలంటున్నారు.