చలికాలంలో తక్కువ నీరు తాగితే  వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే..

తక్కువ నీరు తాగడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.లేదంటే తినే ఆహారం జీర్ణం కాదు. ఇది స్థూలకాయానికి దారితీస్తుంది.

తక్కువ నీరు త్రాగే అలవాటు వల్ల నోరు పొడిబారుతుంది. దీంతో నోటిలో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. నోటి నుండి దుర్వాసన కూడా వస్తుంది.

అంతేకాకుండా శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు చెమట, మూత్రవిసర్జన తగ్గుతుంది. దీని కారణంగా విష పదార్ధాలు శరీరం నుండి బయటకు వెళ్ళదు. 

నీటి కొరత వల్ల మెదడు కణాలు తాత్కాలికంగా తగ్గిపోవడం వల్ల తలనొప్పి సమస్యలు వస్తాయి. 

శరీరానికి సరిపడా నీరు లేకపోవడం వల్ల కడుపులో యాసిడ్ ఏర్పడటం పెరుగుతుంది. ఇది కడుపులో గ్యాస్ ఏర్పడటానికి దారితీస్తుంది. 

శరీరంలో నీరు లేకపోవడం వల్ల చర్మం పొడిబారడం, నల్లటి వలయాలు, దురద, ముడతలు వంటి సమస్యలు వస్తాయి.

 చలికాలంలో దాహం వేయకపోయినా రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి.