చలికాలంలో జామపండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

చలికాలంలో రోజుకు ఒక జామపండు తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

జామ పండు తినడం వల్ల కోరింత దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. 

ఈ పండులోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

రోజూ జామ పండును తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. 

మలబద్ధక సమస్యను తగ్గించడంతో పాటూ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

జామంపడులోని పొటాషియం నరాలకు విశ్రాంతిని ఇచ్చి రక్తపోటు పెరగకుండా చేస్తుంది. 

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. 

ఆక్సీకరణ ఒత్తిడి, ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

జామపండ్లు ఎక్కువ తింటే కడుపు ఉబ్బరం, నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.