వాతావరణం కాస్త చల్లబడితే చాలు... ముందుగా మనకు గుర్తొచ్చేది మొక్కజొన్న

వేడి వేడి మొక్కజొన్న తింటే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది

ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎన్నో లాభాలను చేకూరుస్తాయి

దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇది చాలా మంచి మందు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

మొక్కజొన్న వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుందాం... 

మొక్కజొన్నలోని విటమిన్-బి12, ఇనుము, ఫోలిక్ యాసిడ్ రక్తహీనతకు చెక్ పెడతాయి

మొక్కజొన్నలో ఉండే కెరొటినాయిడ్లు, బయో ఫ్లేవనాయిడ్లు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్​ను అదుపులో ఉంచుతాయి

కండరాలను దృఢంగా మారుతాయి,కంటిచూపుని మెరుగుపరుస్తుంది

మొక్కజొన్నలోని పిండి పదార్థాలు శరీరానికి శక్తినిచ్చి చురుగ్గా ఉండేలా చేస్తాయి

గర్భిణులకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ కూడా మొక్కజొన్నల నుంచి అందుతుంది