బాదం పప్పును అతిగా తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. అవేంటంటే..

బాదం పప్పును ఎక్కువగా తినడం వల్ల దద్దుర్లు, వికారం, వాంతులు వంటి ఎలర్జీలకు దారి తీస్తుంది.

బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

బాదం పప్పును ఎక్కువగా తీసుకుంటే అందులోని ఫైబర్‌ కారణంగా గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం కావొచ్చు.

వీటిని అతిగా తింటే.. శరీరంలో విష పదార్థాలు పెరగడానికి కారణమవుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.