ఉదయం తేనె మరియు నిమ్మకాయ కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

నిమ్మకాయ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్ తదితర సమస్యలను తగ్గిస్తుంది.

శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. బరువు తగ్గడానికీ సహాయపడుతుంది. 

నిమ్మకాయ, తేనె మిశ్రమం తక్షణ శక్తిని అందిస్తుంది. తద్వారా మీరు రోజంతా ఎనర్జీగా ఉంటారు. 

నిమ్మకాయ, తేనె కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి. అలాగే చర్మం కూడా మెరుగ్గా మారుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.