ఉదయం లేవగానే  ఫోన్  చూడడం అందరికీ అలవాటు. 

అయితే ఇది ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

నిద్ర లేవగానే ఫోన్ చూడడం వల్ల ఎల్ఈడీలోని ప్రకాశవంతమైన కాంతి కళ్లపై ప్రభావం చూపుతుంది. 

దీంతో మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

ఉదయమే ఫోన్‌లో గడపడం వల్ల నిద్రలేమి, ఆందోళనతో పాటూ ఒంటి నొప్పులు ఎక్కువవుతాయి.

ఉదయం లేవగానే ఫోన్ చూడడం వల్ల ఏకాగ్రత కోల్పోవడం, తల బరువుగా అనిపించడంతో పాటూ నొప్పి కూడా కలుగుతుంది.

రాత్రి వేళల్లో ఫోన్ ఎక్కువ వాడితే నిద్రలేమి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

కళ్లలో వాపు, నొప్పితో పాటూ అలసట, పొడిబారడం వల్ల దురద సమస్యలు పెరుగుతాయి.