ప్రతిరోజూ రాగిజావను తీసుకోవచ్చు.

ఎప్పుడు పడితే అప్పుడు తినడం మంచిది కాదు దానికంటూ ఓ టైమ్ ఫిక్స్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు

రాగి జావను ఉదయం తీసుకుంటే చాలా మంచిది.రాత్రిపూట తీసుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు.

మూత్రపిండాల్లో రాళ్లు మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారు  దీనికి దూరంగా ఉంటే మంచిదని అంటున్నారు.

బరువు పెరగాలనుకునేవారు రాగి జావను ఎక్కువగా తీసుకోవద్దు. కొంచెంగా తీసుకోవచ్చు. ఎందుకంటే రాగజావ వినియోగంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు రాగులు తినకపోవటం మంచిది.

రాగిలో థైరాయిడ్ గ్రంథి సాధారణ పనితీరుకు ఆటంకం కలిగించే గోయిట్రోజెన్‌లతో నిండి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.