సపోటా తింటే..  ఈ లాభాలు మీ సొంతం! 

సపోటాలో ఐరన్‌, పోటాషియం, కాపర్‌, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఫాస్ఫరస్‌, విటమిన్స్ యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. 

సపోటాలోని కాల్షియం, ఐరన్‌, ఫాస్పరస్‌.. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎముకల్ని దృఢంగా ఉంచి, ఆస్టియోపోరోసిస్‌ ముప్పును తగ్గిస్తాయి.

సపోటాలో ఉండే విటమిన్‌ సీ, కాపర్‌ వంటి పోషకాలు.. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

సపోటాలోని పొటాషియం, మెగ్నీషియం.. రక్త ప్రసరణను ప్రోత్సహించి, బ్లడ్‌ ప్రెజర్‌ స్థాయిల్ని నియంత్రిస్తాయి. గుండె సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి.

సపోటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, విటమిన్స్.. నోటి, ఊపిరితిత్తులు, పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాలను నివారించడంలో సహాయపడతాయి.

సపోటాలో అధిక మొత్తం క్యాలరీలు ఉంటాయి. ఈ పండును తింటే..  తక్షణ శక్తి అందుతుంది. జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది.

సపోటాలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఈ పండును రెగ్యులర్‌గా తీసుకుంటే.. కంటి ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సపోటాలోని విటమిన్ ఈ చర్మానికి తేమనందిస్తుంది. యాంటీఆక్సిడెంట్స్.. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షించి యాంటీ ఏజింగ్ కాంపౌండ్‌గా పనిచేస్తుంది.